పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఓజి”పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హరిహర వీరమల్లు తర్వాత పవన్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నాడు. సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన సోషల్ మీడియా పోస్ట్‌తో అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్‌కు ముందు సీక్రెట్‌గా హింట్ ఇచ్చినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
థమన్ షేర్ చేసిన “గన్” ఎమోజీతో పాటు “కల్ట్స్” అన్న పదం చూసి అభిమానులు ఈ పాటకు సంబంధించిందేనని ఊహించుకుంటున్నారు. ఈ సింగిల్‌ను ఆగస్టు నెలలో రిలీజ్ చేయనున్నట్టు ఇండస్ట్రీ టాక్. అయితే మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం ఇంకా రాలేదు. అంతేకాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.