పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలు వరుసగా తెరకెక్కుతూ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. డైరెక్టర్ మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ చిత్రంతో పాటు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ మూవీలో ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ వార్ మూవీగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ప్రేక్షకులను స్టన్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ సర్కిల్స్ లో షికారు చేస్తుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ దిషా పటాని ఓ కేమియో పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది. ఆమె పాత్రతో పాటు మరో ముఖ్యమైన రోల్ కూడా ఉందని.. దీని కోసమే దిషా పటానిని దర్శకుడు అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, ప్రభాస్ సరసన దిషా పటాని ఇప్పటికే ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో నటించింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రభాస్ సరసన దిషా కేమియో పాత్రలో నటించనుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.