టాలీవుడ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో శ్రీ విష్ణు పేరు ముందుంటుంది. ఆయన సినిమా వస్తుందంటే హ్యుమర్‌తో పాటు ఓ డిఫరెంట్ ట్రీట్ ఉంటుంది అనే అంచనాలు ప్రేక్షకుల్లో క్రియేట్ అవుతాయి. తాజాగా ఆయన నటించిన ‘సింగిల్’ సినిమా మంచి స్పందన అందుకోవడంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అని చెప్పొచ్చు.
ఇప్పుడు శ్రీ విష్ణు చేస్తున్న తదుపరి సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. గతంలో ఆయన నటించిన ‘సామజవరగమనా’ సినిమా ఎంత మంచి విజయాన్ని అందిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆయన క్రేజ్ నెక్ట్స్ లెవెల్‌కి చేరింది. ఆ సినిమా తీసిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు కూడా ప్రేక్షకులపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు.
తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరోసారి సినిమా రాబోతోందని సమాచారం. రామ్ అబ్బరాజు ఇటీవల ఓ కథ శ్రీ విష్ణుకు వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేశారని టాక్. దీంతో మళ్లీ ‘సామజవరగమనా’ లాంటి హిట్ కోసం ఈ కాంబో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అభిమానులు, ఆడియెన్స్ మాత్రం ఈ కొత్త ప్రాజెక్ట్ ఎలాంటి కథతో, ఎలాంటి ట్రీట్మెంట్‌తో వస్తుందో అని కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా సెట్స్‌కి ఎప్పుడు వెళ్లబోతోందో, టైటిల్ ఏంటో అనే వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.