2024 గ్రాండ్‌ గా సెండాఫ్‌ ఇస్తున్న శ్రీవల్లి!

అందాల ముద్దుగుమ్మ రష్మిక  గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమ్మడు వరుస హిట్లు కొడుతూ నేషనల్ క్రష్ గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా తన కెరీర్ లో మెమొరబుల్ ఇయర్ 2024కు సెండాఫ్ ఇచ్చేందుకు సిద్దమైంది నేషనల్ క్రష్. ఈ ఏడాది ఆమె “పుష్ప 2” వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ వసూళ్లలో బాలీవుడ్ లోనూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది పుష్ప 2 సినిమా.

ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక పర్ ఫార్మెన్స్ అందరినీ బాగా ఆకర్షించింది. ప్రత్యేకించి జాతర ఎపిసోడ్ లో రష్మిక డైలాగ్స్ అయితే ఏ రేంజ్‌ లో ఉంటాయో అందరికి తెలిసిందే. రష్మికకు ఎంతోమంది కొత్త అభిమానులను సంపాదించిపెట్టింది పుష్ప 2 సినిమా.“పుష్ప 2” తో పాటు రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ తాజాగా విడుదలై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా రష్మిక కెరీర్ లో మరో మైల్ స్టోన్ అవ్వనుంది.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సికిందర్ సినిమా కూడా రెగ్యులర్ చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమాలో నటించడం కూడా రష్మికకు 2024 మిగిల్చిన ఒక మంచి జ్ఙాపకమే అని తెలుస్తుంది. ఈ బ్లాక్ బస్టర్ ఇయర్ కు సెండాఫ్ ఇస్తూ మరో సెన్సేషనల్ స్టార్ట్ కోసం 2025 కు వెల్ కమ్ చెప్పేందుకు ఆమె ఎంతో బాగా ఎదురు చేస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories