ఆ స్టార్‌ హీరో సినిమాని రిజెక్ట్‌ చేసిన శ్రీలీల!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీలనే.
 గత ఏడాది వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అగ్ర హీరోల చాలా మంది సరసన నటించిన ఈ బ్యూటీకి ప్రెజెంట్ పెద్దగా ఆఫర్స్ లేవు. అయితే ఇటీవలే ఈ హీరోయిన్ కు ఓ బిగ్ ఆఫర్ వచ్చింది… కానీ ఆ ఆఫర్‌ని శ్రీలీల తిరస్కరించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ 2’ సినిమాలో లో రెండో కథానాయిక పాత్ర కోసం శ్రీలీలను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఆమె ఈ అవకాశాన్ని తిరస్కరించడం సినీ పరిశ్రమలో పెద్ద టాపిక్‌ అయ్యింది. శ్రీలీల తన నిర్ణయానికి కారణాలను ఇంకా ఎవరికి చెప్పలేదు. అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కథలో ఆమె పాత్రకు తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్లే ఈ ఆఫర్ ను వద్దనుకున్నట్లు సమాచారం.

కాగా ఇలాంటి ఓ బడా ప్రాజెక్ట్ లో యాక్ట్ చేసే ఛాన్స్ ను శ్రీలీల రిజెక్ట్ చేయడం గురించి తెలిసిన ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. శ్రీలీల ఈ ఆఫర్ ను తిరస్కరించడంతో ‘సర్దార్ 2’ చిత్రబృందం ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. సర్దార్‌లో కార్తీ డ్యూయల్ రోల్ చేశాడు. ఒకటి స్పై ఏజెంట్, మరొకటి పోలీస్ ఆఫీసర్. ఈ సినిమాలో కూడా అలాంటి రకరకాల పాత్రల్లో కనిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories