రెండు బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పిన శ్రీలీల!

యంగ్‌ హీరోయిన్‌, ముద్దుగుమ్మ శ్రీలీల పని అయిపోయిందనుకున్న టైంలో మరింత దూసుకుపోయేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే తమిళం లో సూపర్‌ ఛాన్స్ లు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా  బాలీవుడ్ లోనూ సూపర్ డూపర్ అవకాశాలు చేజిక్కించుకున్నట్లు సమాచారం. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. అందులో హీరోయిన్ గా ఈ భామనే ఫైనల్ చేసినట్లు సమాచారం.

హిందీ ఇండస్ట్రీకి ఫ్రెష్ ఫేస్ కావాలనే ఉద్దేశంతో తనను ఎంచుకున్నట్లు సమాచారం. కాగా వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న కామెడీ జోనర్ సినిమాలో కూడా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇక కోలీవుడ్ లో విజయ్ దళపతి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ బ్యూటీ… స్టార్ హీరో అజిత్ చిత్రంలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాలు సక్సెస్ అయితే ఈ తెలుగమ్మాయి టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా ఓ వెలుగు వెలగడం ఖాయమని తెలుస్తుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories