పూజా కార్యక్రమాలతో మొదలైన శ్రీ విష్ణు సినిమా!

హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన సామజవరగమన మంచి హిట్ కావడంతో ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా Sree Vishnu x Ram Abbaraju 2 అనే పేరుతో ప్రారంభించారు.

దసరా పండుగ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ప్రత్యేక అతిథిగా వచ్చిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందించారు. ఈ వేడుకకు నారా రోహిత్, నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, దర్శకులు వివేక్ ఆత్రేయ, హసిత్ గొలి హాజరై కొత్త సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories