రామ్ చరణ్ ప్రస్తుతానికి శంకర్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు రెడీ అవుతున్నాడు. తన 16వ సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామా అని ముందు నుంచే ఓ టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం బాడీ బిల్డ్ చేసేందుకుగాను చరణ్ ఆస్ట్రేలియా కు వెళ్లినట్లు సమాచారం.
ఆస్ట్రేలియాలో రామ్ చరణ్ తేజ బాడీ బిల్డింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ముందే బాడీ ఫిట్గా ఉంచుకోవాలని భావించి ఆయన అక్కడికి వెళ్లినట్టు సమాచారం. ఈ సినిమా కోసం రాంచరణ్ అథ్లెటిక్ లో కనిపించాల్సి ఉంది. గత మూడు వారాల నుంచి ఆస్ట్రేలియాలోనే చరణ్ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈ నెలాఖరున ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులలో ఒక పెద్ద ఊరి సెట్ వేసినట్లు సమాచారం. రాంచరణ్ ఇంటి తో పాటు అతని లొకాలిటీ అంతా అక్కడే షూట్ చేయబోతున్నట్లుగా సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న బుచ్చిబాబు చరణ్ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు.