స్పెషల్‌ థ్యాంక్స్‌ టు యూ!

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా సుజీత్‌ – సందీప్‌ సంయుక్తంగా రూపొందించిన ‘క’ సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందింది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా తన సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కిరణ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ఇంతకీ, కిరణ్ ఏం చెప్పారంటే అంటే.. ‘’క’ సినిమాకు ఓవర్సీస్‌లోనూ మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఆదరించి ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించారు. గతంలో నాకు ఎప్పుడూ రానన్ని ఫోన్లు, మెసేజ్‌లు ఇప్పుడు వస్తున్నాయి. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

అమెరికాలో ఉన్న వాళ్లు  కూడా ఫోన్‌ చేసి సినిమా చాలా బాగుందని చెబుతుంటే నాకు మాటలు రావడం లేదు. క్లైమాక్స్‌ చాలా ఆసక్తిగా ఉందని అంటున్నారు. ఇంత మంచి సక్సెస్‌ను ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అక్కడికి వచ్చి మీ అందరినీ ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది’ అని కిరణ్‌ అబ్బవరం చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories