పవన్‌ కి అన్నదమ్ముల స్పెషల్‌ థ్యాంక్స్‌!

టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లోనే పలు ఊహించని కాంట్రవర్సీల విషయంలో కూడా పవన్ స్పందించడం నేషనల్ వైడ్ ట్రెండ్‌ అవుతుంది.

 అయితే పవన్ కళ్యాణ్ కోలీవుడ్ ప్రముఖ హీరో కార్తీ విషయంలో చేసిన కామెంట్స్ నిన్న పెద్ద ఎత్తున చర్చగా మారాయి. అయితే ఈ విషయం గురించి కార్తీ తిరిగి సారీ చెప్పడం… దానికి పవన్ కళ్యాణ్ వివరణ ఇస్తూ మనం పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలని  చెప్తూ తన సినిమా “సత్యం సుందరం” విడుదలకి హీరో కార్తీకి అలాగే నిర్మాత, కార్తీ సోదరుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తన శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ పోస్ట్ వేసిన వెంటనే కార్తీ రెస్పాండ్ అయ్యి పవన్ కి ధన్యవాదాలు తెలుపగా ఈ తర్వాత ఊహించని విధంగా సూర్య కూడా పవన్ పోస్ట్ కి రిప్లై ఇచ్చి కృతజ్ఙతలు  చెప్పాడు. దీంతో వీరి రిప్లై లు ఫ్యాన్స్ లో స్పెషల్ గా మారి వైరల్ అవుతున్నాయి. మరి కార్తీ నటించిన సత్యం సుందరం ఈ సెప్టెంబర్ 27న తమిళ్ లో రిలీజ్ కానుండగా తెలుగులో 28న రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories