బాలయ్య కోసం స్పెషల్‌ సెట్‌!

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా వచ్చే వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో బాలయ్య పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందుకోసం, అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా మొత్తానికే ఈ సన్నివేశాలు మెయిన్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్నట్టు మేకర్స్ ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి తీసుకుని రాబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories