ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినపడుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేయాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ అనుకుంటున్నాడంట. ఆ హీరో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ అని తెలుస్తుంది. ఓ పోలీస్ పాత్రలో రణ్ వీర్ సింగ్ కనిపించబోతున్నాడని సమాచారం.
ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. అయితే ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు . ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.