వార్‌ 2 పై స్పెషల్‌ కేర్‌!

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘వార్-2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించగా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఈ మూవీలో హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

అయితే, ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు రాగా, అందులో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మేకర్స్ ఈ విషయంపై తీవ్ర ఆలోచనలో పడ్డారు. వారు వెంటనే ఈ సినిమా టీజర్‌లో ఎలాంటి లోపాలు జరిగాయా అనే పాయింట్‌లో పరిశీలిస్తున్నారు.

ఒకవేళ ఈ చిత్ర టీజర్‌లో నిజంగానే లోపాలు ఉంటే, వాటిని సరిచేసుకుని వచ్చేసారి కరెక్ట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని వారు ఆలోచిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా యశ్ రాజ్ ఫిలింస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories