కొడుకు బర్త్‌ డేలో సూపర్‌ స్టార్‌!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. దాంతో మహేష్‌ తన లుక్‌ ని మార్చే పనిలో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఏ మాత్రం ఖాళీ దొరికినా తన పూర్తి సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు రెడీ అవుతున్నాడు.

.తాజాగా తమ వారసుడు గౌతమ్ ఘట్టమనేని తన 18వ పుట్టినరోజుని చేరుకోగా మహేష్ అండ్ ఫ్యామిలీ గౌతమ్ కి బ్యూటిఫుల్ విషెస్ ని సోషల్ మీడియాలో తెలియజేశారు. లేటెస్ట్ గా గౌతమ్ బర్త్ డే ఫోటోలను మహేష్ భార్య నమ్రత షేర్ చేసుకోవడం వైరల్ గా మారింది.ఇందులో గౌతమ్ బర్త్ డేని సెలబ్రేట్ చేస్తూ కనిపించారు. దీంతో ఆ హ్యాపీ మూమెంట్ నుంచి ఒక బ్యూటిఫుల్ పిక్ వైరల్ గా మారింది. దీంతో ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories