ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో టాప్ హీరోయిన్స్ జాబితాలో ముందుండే పేరు రష్మిక మందన్నా. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆమె నటించిన సినిమాల్లో ఇటీవల వచ్చిన ‘సికందర్’ను మినహాయిస్తే, మిగతా అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక కుబేర సినిమాతో రష్మిక మరోసారి తన హిట్ ఫామ్ ను నిలబెట్టుకుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం, రష్మిక తన తదుపరి సినిమాగా ఓ సొంత ప్రాజెక్ట్‌ను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో టైటిల్‌ను రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల చేయనున్నట్టు తెలిపింది. పోస్టర్‌లో ఉన్న విజువల్స్ చూస్తే ఇది పీరియాడిక్ వర్షన్‌తో కూడిన వారియర్ డ్రామా అంటూ భావించవచ్చు. అయితే ఈ సినిమా అసలు కాన్సెప్ట్ ఏంటి, పాత్ర ఎలా ఉండబోతోందన్న విషయంలో పూర్తి క్లారిటీ రావాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే.
ఈ సినిమాను యూనిఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రష్మిక ఒక మాస్ కమర్షియల్ సినిమా కాకుండా పూర్తిగా తనపై ఆధారపడే స్టోరీతో ముందుకు రావడం సినీ ప్రేమికుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్‌తో రష్మిక తన కెరీర్‌లో కొత్త ఛాప్టర్‌ను మొదలుపెట్టనుందని అభిమానులు భావిస్తున్నారు.