ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం అంతకు మించి, పాన్ వరల్డ్ స్థాయిలో పేరు తెచ్చుకునేలా రూపొందుతోన్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఒకటుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం. ఎన్నో సంవత్సరాలుగా మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్న కాంబో ఇది. ఇద్దరూ టాలెంటుతో పాటు వేరే స్థాయిలో ఫాలోయింగ్ కలవారు దీంతో ఆ కారణంగా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఓ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాగా తీర్చిదిద్దేందుకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించి, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా ఓ గ్లింప్స్ ని కూడా రూపొందిస్తున్నారని సమాచారం. ఆ గ్లింప్స్ విడుదలైతే మాత్రం సినిమా రేంజ్ ఇంకెక్కడికో వెళ్లిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి స్టార్ కి, రాజమౌళి లాంటి మాస్టర్ డైరెక్టర్ తోడైతే అది అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఈ గ్లింప్స్ ఆగస్ట్ 9న, అంటే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిలింనగర్ లో జోరుగా చర్చ సాగుతుంది. ఇది నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకు ఇది ఒక మైలురాయి కానుక అవుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ ఇప్పటినుంచే ఈ అప్‌డేట్ పై అభిమానుల్లో హైప్ మొదలైపోయింది.
ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా కథే కాదు, ప్రతి చిన్న విషయమూ ఇంటర్నేషనల్ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. మరి ఎంతటి ప్రభావం చూపుతుందో చూడాలి.