తెలుగు స్టేట్ ఉప ముఖ్యమంత్రి అలాగే టాలీవుడ్ కి పవర్ స్టార్ కూడా అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ చిత్రం “ఓజి” కూడా ఒకటి. పవన్ ఓజాస్ గంభీరగా కనిపించనున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
అయితే గత కొన్నాళ్ల కితమే ఈ సినిమా తాలూకా ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయాల్సి ఉంది కానీ పలు కారణాల రీత్యా అది వాయిదా పడింది. మరి అసలు ఈ సాంగ్ ని ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై సంగీత దర్శకుడు థమన్ ఎస్ సాలిడ్ అప్డేట్ ని అందించాడు.
తమ బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఆరోజు గిఫ్ట్ గా అయితే ఓజి ఫస్ట్ సింగిల్ ‘ఫైర్ స్ట్రాం’ని విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ సాంగ్ నే తమిళ హీరో శింబు పాడారు. మరి ఆ రోజు కోసం ఇపుడు పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.