తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా కొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 4న అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.