సాలిడ్ అప్డేట్! ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన “డాకు మహారాజ్” చిత్రంతో వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న ఏకైక హీరోగా ఇప్పుడు ట్రెండ్ లో నిలిచారు. ఇలా బాలయ్య నుంచి మరిన్ని సినిమాలు రాబోతుండగా వాటితో తన అవైటెడ్ క్రేజీ సీక్వెల్ చిత్రం అఖండ 2 కూడా ఒకటి.
దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న ఈ సినిమాని అంతకు మించిన రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. మరి లేటెస్ట్ గా సాలిడ్ అప్డేట్ ఈ సినిమాపై తెలుస్తుంది. దీని ప్రకారం మేకర్స్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారట. బాలయ్యపై సినిమాలో ఇది మరో బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచే విధంగా బోయపాటి ప్రత్యేకంగా డిజైన్ చేయినట్టుగా తెలుస్తుంది.
దీనితో ఈ సినిమా యాక్షన్ పరంగా మాత్రం అఖండ 2 వేరే లెవెల్ ట్రీట్ ని అందించేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.