బిగ్ బాస్’ ఫేమ్, హీరో సోహైల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సోహైల్ తల్లి గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోహైల్ తల్లి ఫైమా సుల్తానా గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. దీంతో సోహైల్ శోకసంద్రంలో మునిగిపోయాడు. సోహైల్ తల్లి పార్థివ దేహాన్ని తన స్వస్థలం కరీంనగర్‌కు తరలిస్తున్నారు. ‘కొత్త బంగారులోకం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్ టీవీ రియాలిటీ షో ‘బిగ్ బాస్-4’తో మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
‘లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు’ వంటి వరుస సినిమాలతో సోహైల్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న సంగతి తెలిసిందే.