బుజ్జి బంగారం అంటూ శోభిత పోస్ట్‌…ఎవరి గురించి !

శోభిత ధూళిపాళ ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. ఈ భామ హాలీవుడ్  సినిమాలో కూడా నటిస్తుంది. తాజాగా శోభిత నటించిన మంకీ మాన్‌ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుని తన ఖాతా లో వేసుకుంది.

 ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్న శోభిత గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది.శోభిత  అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమ లో ఉన్నారంటూ ఓగా న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే వీరిద్దరూ కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్లో కనిపించడం ఆ రూమర్లు మరింత ఎక్కువ అయ్యేలా చేసాయి.

సోషల్ మీడియాలో వీరిపై రూమర్లు రోజురోజుకి ఎక్కువ అవుతున్న కూడా  ఈ విషయంపై వారు ఎక్కడ స్పందించలేదు.  అయితే శోభిత గతకొంతకాలంగా సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేస్తున్న పోస్టులు వైరల్‌ గా మారుతున్నాయి. ఇంతకు ముందు ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్, అండ్ దట్స్ ఓకే.. అంటూ రాసుకొచ్చింది. నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు అని దానికి అర్థం. ఆమె Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా చైతన్య గురించి చెప్పిందా అంటూ నెటిజన్లకు అనేక సందేహాలు వచ్చాయి .

ఇదిలా ఉంటే తాజాగా శోభిత  ఓ చిన్ని పాపను ఎత్తుకుని  “బుజ్జి బంగారం” అంటూ బుజ్జగిస్తున్న పోస్ట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది.అలాగే తార మీట్స్ తార అంటూ ఓ  పోస్ట్ చేసింది. ఇది కూడా నాగ చైతన్యను ఉద్దేశించే పోస్ట్ చేసిందా అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories