సో ఎనర్జిటిక్‌ అండ్‌ పవర్ ఫుల్‌ టైటిల్‌ అంతే!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్‌లో 22వ చిత్రాన్ని RAPO22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు పి.మహేష్ బాబు ఈ చిత్రాన్ని పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ఫ్రెష్ జోడీని వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా కావాల్సినంత యాక్షన్ డోస్ కూడా ఉండబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ టైటిల్ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా వివేక్, మెర్విన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories