నెమ్మదించిన వార్‌ 2!

గత వారం థియేటర్స్ లోకి వచ్చిన కొత్త సినిమాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. కానీ తెరపైకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ముఖ్యంగా తెలుగు వెర్షన్ ఎక్కువగా ఆకట్టుకోకపోవడంతో కలెక్షన్స్ కూడా తగ్గాయి.

మొదటి వారాంతానికి వచ్చేసరికి సినిమాకి బుకింగ్స్ స్లో అవ్వడం మొదలైంది. బుధవారం నాటికి పరిస్థితి ఇంకా పడిపోయి, రజినీకాంత్ నటించిన కూలీ సినిమాతో పోలిస్తే వార్ 2 బుకింగ్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories