తమిళ ప్రేక్షకులను లక్ష్యంగా తీసుకుని రూపొందించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “మదరాసి” ఇప్పుడు ఓటిటి ప్రీమియర్‌కి రెడీ అయింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా, యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేశారు. థియేటర్స్‌లో విడుదలైనప్పుడు తమిళంలో ఈ సినిమా సగటు స్థాయిలో ఆకట్టుకుంది. తెలుగు వెర్షన్ కూడా కొంతమందికి నచ్చింది కానీ పెద్దగా రాణించలేకపోయింది.
ఇప్పుడేమో ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి వెళ్తోంది. స్ట్రీమింగ్ హక్కులు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. అధికారికంగా ప్రకటించిన తేదీ ప్రకారం అక్టోబర్ 1 నుండి ఈ చిత్రం ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోంది. తమిళం మాత్రమే కాకుండా తెలుగు, హిందీతో పాటు మరికొన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాకు సంగీతం అందించింది అనిరుద్ రవిచందర్. ప్రొడక్షన్ బాధ్యతలు శ్రీ లక్ష్మి సినిమాస్ వారు చూసుకున్నారు.