తమిళంలో మంచి హిట్ సాధించిన “తలైవన్ తలవి” సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, తమిళంలో విజయవంతం అయిన తర్వాత తెలుగులో “సార్ మేడం” పేరుతో విడుదలై మంచి స్పందన పొందింది. థియేటర్లలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తెలుగు, తమిళం సహా పాన్ ఇండియా భాషల్లో ఆగస్టు 22 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. కాబట్టి థియేటర్లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే సులభంగా ఈ సినిమా చూడొచ్చు.