చుట్టుముడుతున్న పాపాలు : జగన్ పై హత్యాయత్నం కేసు!

తాను అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అందరూ పురుగుల్లా కనిపించారు. మనుషుల్లా కనిపించలేదు. తను తలచుకుంటే ఆ పరుగుల్ని నలిపేయగలనని ఆయన అనుకున్నారు. తనను వ్యతిరేకించిన వారిని, తన మీద విమర్శలు చేసిన వారిని.. సీఐడీ ఇతర వ్యవస్థలను వాడుకుని ఏ రకంగా వేధించారో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో.. అమరావతి గురించి తమ ఆవేదనను వ్యక్తం చేసినందుకు కూడా.. 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళ లని కూడా చూడకుండా విచారణ పేరుతో వేధించిన జగన్మోహన్ రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఉండి ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణ రాజు ఏకంగా జగన్ మీద హత్యాయత్నం కేసు పెట్టారు. జగన్ తో పాటు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్  ఆంజనేయులు మీద కూడా కేసులు పెట్టారు. మరికొందరు అధికారుల పేర్లు కూడా ఈ కేసులో ఉన్నాయి.

జగన్ దుర్మార్గపు పాలన సాగుతున్న రోజుల్లో రఘురామ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీగా ఉన్నారు. ఆయన మీద పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయించాలని జగన్ అండ్ కో ఎంత ప్రయత్నించినా.. అందుకు ఆధారాలు చూపించలేకపోయారు. రఘురామ వైసీపీ పార్టీని కీర్తిస్తూనే.. జగన్ ప్రభుత్వ లోపాలను విమర్శిస్తుండేవారు. ఆగ్రహించిన జగన్ దళాలు ఆయన మీద ఏకంగా రాజద్రోహం కేసు నమోదుచేయించాయి.
హైదరాబాదులోని ఇంట్లో నన్ను అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారంట్ కూడా లేకుండా, వైద్య పరీక్షలు చేయించకుండా గుంటూరు సీఐడీ ఆఫీుకు తరలించారని.. అక్కడ రబ్బరు బెల్టు, లాఠీలతో తీవ్రంగా కొట్టారని, బైపాస్ సర్జరీ చేయించుకున్న తాను మందులు వేసుకోడానికి కూడా అనుమతించలేదని రఘురామ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూరక్చుని ఊపిరాడనివ్వకుండా తనన చంపేందుకు ప్రయత్నించారని ఆయన అన్నారు. సీఐడీ చీఫ్ సునీల్ కు మార్ చంపేస్తానని బెదిరించారని.. ఇదంతా జగన్ చెప్పడం వల్లనే జరిగిందని అంటూ.. వారి మీద హత్యాయత్నం కేసు పెట్టారు.

రఘురామ ఫిర్యాదుపై న్యాయసలహాల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇప్పుడు జగన్ పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇప్పటిదాకా ఎదుర్కొంటున్న ఆర్థిక నేరాల వైట్ కాలర్  కేసులు మాత్రమేకాదు.. ఇప్పుడు క్రిమినల్ విచారణ కూడా  ఎదుర్కోవాలి. ఈ కేసుల్లో ఆయన అరెస్టు రిమాండు త్వరలోనే ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories