రాహుల్ సిప్లిగంజ్ గురించి బిగ్ బాస్ ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఆ షో లో విన్నర్ గా నిలిచిన తరువాత రాహుల్ కు ఆఫర్లు వరుస కట్టాయి. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఓ సినిమాలో హీరోగా కూడా చేశాడు. ఇదంతా ఇలా ఉంటే యావత్ ప్రపంచాన్ని మెప్పించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నాటు నాటు పాట పాడి అభిమానులకు మరింత చేరువఅయ్యాడు.
ఆస్కార్ వేదిక మీద మరోసారి ఆ పాట పాడి ఆ అవార్డును తెలుగు చిత్ర సీమకు బహుమతిగా అందించారు. రాహుల్ ఎప్పుడూ కూడా అభిమానులతో టచ్ లోనే ఉంటాడు. ఫ్యాన్స్ తో చాటింగ్ కూడా చేస్తుంటాడు. ఇక్కడ వరకు బానే ఉంది. తన ఎక్స్ లవర్ రతిక మేమిద్దరం ప్రేమికులమని చెప్పేవరకు ఆ విషయం బయట ఎవరికీ తెలియదు.
అయితే ఆ విషయం గురించి రతిక బయటకు చెప్పడంతో రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు కూడా. అయితే ప్రస్తుం వీరిద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుత కాలంలో హీరోలు, సింగర్స్ ఏం చెబితే అది చేస్తామనే ట్రెండ్ ఒకటి నడుస్తుంది. తాజాగా ఓ యువకుడు రాహుల్ అన్న ఈ వంటకు కామెంట్ చేస్తే చాలు నేను వంట నేర్చుకుంటానని లేకపోతే లేదు అంటూ ఓ వంటకాన్ని పూర్తిగా మాడిపోయేలా చేశాడు.
అది కాస్త వైరల్ గా మారి రాహుల్ వరకు వెళ్లింది. దానికి రాహుల్ రిప్లై గా చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.