తమిళ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూసిన రజనీకాంత్ తాజా చిత్రం కూలీ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, ఇందులో అక్కినేని నాగార్జున కీలక ప్రతినాయకుడిగా సైమన్ పాత్రలో కనిపించారు. ఈ పాత్ర గురించే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతోంది.
నాగార్జున స్క్రీన్‌పై చూపించిన స్టైల్, యాక్షన్ సీన్స్, ఎనర్జీ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సీనియర్ హీరో అయినప్పటికీ, కొత్త లుక్‌తో, ఆధునిక యాటిట్యూడ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా తమిళ ప్రేక్షకులు ఆయన నటనను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయన సైమన్ రోల్ గురించి ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇక ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, నాగార్జున గతంలో నటించిన రచ్చగన్ (తెలుగులో రక్షకుడు) సినిమాలోని ప్రసిద్ధ పాట సోనియా సోనియా మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.