వెట్రిమారన్‌ కోసం శింబు డెడికేషన్‌!

తమిళ నటుడు శింబు ఎప్పుడూ తన సినిమాల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఇటీవలే కమల్ హాసన్‌తో కలిసి నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించాడు. ఈ సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోయినా, శింబు పోషించిన పాత్రకు మాత్రం మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమా కోసం పక్కాగా సిద్ధమవుతున్నాడు.

ఈసారి శింబు, యాక్సిపెరిమెంటల్ చిత్రాలకు పేరొందిన దర్శకుడు వెట్రిమారన్‌తో జట్టుకట్టాడు. వెట్రిమారన్ తెరకెక్కించే సినిమాలకు సొంతమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. ఆయన చెప్పిన కథకు కట్టుబడి, శింబు ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా పని చేస్తున్నాడట. తన పాత్రకు న్యాయం చేయాలని, కేవలం పదిరోజుల్లోనే పదికిలోల బరువు తగ్గినట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పుడు శింబు శరీరంలో వచ్చిన ఈ మార్పు, వెట్రిమారన్ సినిమాకు పెట్టిన కృషి చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా, పరిశ్రమలోని పలువురు కూడా శింబు పట్టుదలపై మంచి మాటలే చెబుతున్నారు. పాత్ర కోసం ఈ స్థాయిలో డెడికేషన్ చూపించడాన్ని చూస్తే, ఈ సినిమాతో శింబు తన కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకుంటాడేమో అన్న ఆసక్తి పెరిగిపోతోంది.

ఇప్పటికే ఈ మూవీపై అందరిలోనూ అంచనాలు ఏర్పడుతున్నాయి. వెట్రిమారన్ టేకింగ్, శింబు ఎఫర్ట్స్ కలిపి ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందో లేదో త్వరలోనే తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories