సైలెంట్‌ గా కాంచన 4..!

కామెడీతో కలిపిన హారర్ సినిమాలు ఆడియెన్స్‌ను ఎంతగా ఎంటర్టైన్ చేస్తాయో తెలిసినదే. కోలీవుడ్‌ నుండి వచ్చిన ‘ముని’ అనే సినిమాతో మొదలైన ఈ ప్రయాణం, తర్వాత ‘కాంచన’ సిరీస్‌గా మారి బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాలు సాధించింది. రాఘవ లారెన్స్ స్వయంగా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ హారర్ ఫ్రాంచైజ్‌కు ఒక్కొక్క సినిమాతో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇప్పుడు ఈ సిరీస్‌కి నాలుగో భాగం రూపొందుతోందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. గత చిత్రాల జోలికి పోకుండా ఈసారి మరింత భిన్నంగా ఉండేలా లారెన్స్ కథను తీర్చిదిద్దినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడుగా జరుపుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పెద్ద హంగామా లేకుండా, ఎలాంటి సందడి లేకుండానే టీమ్ సినిమాను పూర్తిచేస్తోంది అనడం కూడా నిజమే.

ఈ సినిమాకి సంబంధించి మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండటం. చాలా రోజుల తర్వాత ఆమె తమిళ సినిమాల్లో ఓ మేన్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఈ సినిమాపై మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉండగా, ఈ సిరీస్‌లో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమనే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories