సజ్జల అరెస్టుకు సంకేతాలు!

‘నాకే పాపం తెలియదు. నేను అమాయకుడిని. నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. నాకు ముందస్తుగా బెయిలు ఇవ్వండి’ అంటూ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రముఖుల్లో సజ్జల రామక్రిష్ణారెడ్డి కూడా ఉన్నారు. జగన్ జమానాలో వైసీపీ మూకలు చెలరేగి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడిచేసిన వ్యవహారం వెనుక సూత్రధారిగా సజ్జల పాత్ర ఉన్నదిన కేసులో నమోదు చేశారు. అయితే దానితో తనకు సంబంధం లేదని తాను అమాయకుడిని అని సజ్జల చెప్పుకుంటున్నారు. ఆ కేసు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సజ్జల రామక్రిష్ణారెడ్డి మీద మరో కేసులో గుంటూరు జిల్లా ఎస్పీ లుకౌట్ నోటీసు జారీచేసి ఉన్న వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని ఎఫెక్ట్.. త్వరలోనే సజ్జల రామక్రిష్ణారెడ్డి అరెస్టు కావచ్చుననే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి.

సజ్జల రామక్రిష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సకలశాఖల మంత్రిగా అందరూ కీర్తించేవిధంగా అధికారం చెలాయించారు. పేరుకు ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు అయినప్పటికీ.. డీఫ్యాక్టో ముఖ్యమంత్రి ఆయనే అయినట్టుగా అందరి మీద పెత్తనం చేశారు. జగన్మోహన్ రెడ్డి కి మీడియా ముందు మాట్లాడడం అంటే భయం అని చెబుతూ..  సీఎం స్పందించాల్సిన ప్రతి సందర్భంలోనూ ఆయనే తమ వాదన వినిపించేవారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం సమస్తాన్ని ఆయన తన చెప్పుచేతల్లో ఉంచుకుని నడిపించారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి సజ్జల మీద ఇప్పుడు లుకౌట్ నోటీసు జారీ కావడం విశేషమే.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో సూత్రధారిగా సజ్జల పాత్ర ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అదే సమయంలో.. కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసులో ముంబాయి నటి కాదంబరి జెత్వానీని, ఆమె కుటుంబం సహా అత్యంత అమానుషంగా అరెస్టు చేసి పోలీసులు దారుణంగా బెదిరించి భయపెట్టడం వెనుక అసలు కీలక వ్యక్తి సజ్జల రామక్రిష్ణారెడ్డే అని కూడా మీడియాలో వచ్చింది. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు. మొత్తానికి ఆ కేసులో కూడా ఆయన పేరు కేసులోకి వచ్చే అవకాశం ఉంది. సజ్జల కోసం గుంటూరు జిల్లా పోలీసులు వెతుకుతున్నారని, త్వరలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నదని కూడా డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించడం గమనార్హం.
సజ్జల రామక్రిష్ణారెడ్డి మొన్నమొన్నటిదాకా తనకు ఎదురులేదు అనుకున్న వ్యక్తి. ఇవాళ అరెస్టు భయంతో ముందస్తు బెయిలుకోసం ఆరాటపడుతుండడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories