సిద్దు ప్రతి ఇంట్లో అబ్బాయి: తారక్‌!

డీజే టిల్లుకి సీక్వెల్‌ గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌ ఈవెంట్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నారు. ముందుగా ఆయన తన అభిమానులకు, సిద్దు జొన్నలగడ్డ అభిమానులకు నమస్కారాలు తెలియజేశాడు.అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా తన నమస్కారాలన్నాడు.

సిద్దు నటించిన సినిమాలను ఇంతకుముందు చూశాను.. కానీ ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కలిసింది లేదు. కరోనా తరువాత సిద్దుతో చాలా బాండింగ్‌ పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా అంటే పిచ్చి ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిద్దు ఒకడు. సిద్దుకి సినిమా తప్ప మరేమి తెలియదు.

డీజే టిల్లు అనే క్యారెక్టర్‌ చూసి సిద్దూ ఇలానే ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు.. కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సిద్దు అలా ఉండడు. తనకి ఎంతసేపు సినిమా… తాను చేస్తున్న క్యారెక్టర్‌ గురించి తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఎంతసేపు అదే తపన.  డీజే టిల్లు సినిమాతో కేవలం సక్సెస్ ని కాదు మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఓ పాత్రను మనకి ఇచ్చాడు.

చాలా సార్లు అనుకునేవాడిని, నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని, పాపాయి, హిమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్లు మన జీవితంలో కేవలం సినిమాల రూపంలో మిగిలిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని, అలాగే ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు. టిల్లు అంటే మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు.

నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం.  బేసిగ్గా నేను నవ్వితే దాన్నిఆపడం  చాలా కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది.

నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి వివరించాను. కలగనే ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని, ఆకలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి అని ఒక డైలాగ్ చెప్పారు.. అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పూయించారు.

అనంతరం పోలే అదిరి పోలే అంటూ త్రివిక్రమ్ ని నవ్వించాడు. దేవర అనే సినిమా లేట్ అయినా మీ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందిస్తామని అంటూ ఆయన ముగించారు

Related Posts

Comments

spot_img

Recent Stories