నాకేందుకు కోపం అండి!

జాతీయ నటుడు అల్లు అర్జున్ తాజా  సినిమా ‘పుష్ప-2’కి సంబంధించి జరిగిన పాట్నా ఈవెంట్‌లో జనం ఎక్కువగా వచ్చారనే విషయంపై నటుడు సిద్ధార్థ్ ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీరు, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారంటూ పరోక్షంగా సదరు ఈవెంట్‌పై సిద్ధార్థ్ అన్నాడు.

దీంతో సోషల్ మీడియాలో అతడిని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై ఆయన మరోసారి స్పందించారు. సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్ యు’ డిసెంబర్ 13న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొందరు జర్నలిస్టులు ఆయనకు  పుష్ప-2 ఈవెంట్‌పై చేసిన కామెంట్స్ గురించి ప్రశ్నలు ప్రశ్నించారు.

అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ గురించి వివరించండి అని మీడియా అడిగింది. దీంతో తనకు అల్లు అర్జున్‌పై ఎలాంటి ద్వేషం లేదని.. పుష్ప-2 ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యినందుకు తాను కూడా సంతోషిస్తున్నానని సిద్ధార్థ్ వివరించాడు.ఈ స్టేట్మెంట్‌తో పుష్ప-2పై తాను చేసిన కామెంట్స్ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని సిద్ధార్థ్ అనుకుంటున్నాడు.   

Related Posts

Comments

spot_img

Recent Stories