డకాయిట్ నుంచి శ్రుతి ఔట్‌..శేష్‌ ఏమన్నాడంటే

టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ప్రస్తుతం చేస్తున్న తాజా చిత్రం “డకాయిట్” గురించి టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫుల్ లెవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని షేనియల్ డియో తెరకెక్కిస్తున్నాడు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, మొదట ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ శ్రుతి హాసన్‌ని ఫీమేల్ లీడ్‌గా ఎంపిక చేశారు. మొదటి దశ షూటింగ్‌ కూడా ఆమెతోనే ప్రారంభమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రుతి ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై మొదట్లో మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. దర్శకుడు లేదా చిత్రబృందంతో ఏమైనా గొడవ జరిగిందేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

కానీ అసలు నిజాన్ని అడివి శేష్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. శ్రుతికి ఇప్పటికే కూలీ సినిమా పనులతో పాటు ఇతర కమిట్మెంట్లు కూడా ఉండటం వల్ల డేట్స్ కేటాయించడంలో తలనొప్పులు వచ్చాయని చెప్పాడు. అందుకే అనుకోకుండా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు.

శ్రుతి వెళ్లిపోయిన తర్వాత మేకర్స్ వెంటనే మృణాల్ ఠాకూర్‌ని తీసుకున్నారు. ఇప్పుడు ఆమె షూటింగ్‌లో జాయిన్ కావడంతో సినిమా పునరుద్ధమవుతోంది. శేష్ – మృణాల్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ జోడీ యాక్షన్ సీన్‌లలో కొత్త ఫీల్ ఇస్తుందేమో అని సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories