లేడీ డీటేక్టివ్‌ గా శ్రుతి హాసన్‌!

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రుతి హాసన్‌ గురించి ఎంత చెప్పినా..ఏమి చెప్పినా తక్కువే… ఎందుకంటే సినిమా సినిమాకి తనలోని వేరియేషన్స్‌ ని కొత్తగా చూపిస్తుంటుంది. పోయిన ఏడాది సలార్ సినిమాతో సూపర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ సంవత్సరం హాయ్‌ నాన్న సినిమాలో ప్రత్యేక గీతం చేసి అలరించింది.

ఆ మూవీ కూడా  హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన ఖాతా లో వేసుకుంది. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.  ఓ సినిమాలో డీటేక్టివ్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా తక్కువ టైమ్‌ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు సినీ కేరీర్‌ను చూస్తే హీరోయిన్ గానే కాదు. మ్యూజిక్‌ డైరెక్టర్ గా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ ను సొంత చేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు హాలివుడ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. చైన్నె స్టోరీ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాలో సమంతను అనుకున్నారు. కానీ  ఆమె అనారోగ్యం కారణంగా సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ ఛాన్స్ శృతిహాసన్ కు వచ్చింది. అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌ అనే హాస్య నవల ఆధారంగా  ఈ మూవీ తీస్తున్నారు. ఇందులో శృతిహాసన్‌ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories