ఆ ఐపీఎస్ లు జైలుకెళ్లక తప్పదా?

ముంబాయికి చెందిన సినిమానటి కాదంబరి జత్వానిని అనుచిత పద్ధతుల్లో అరెస్టు చేసి, ఆమెను కుటుంబ సమేతంగా హైదరాబాదుకు బలవంతంగా తీసుకువచ్చి దుర్మార్గంగా హింస పెట్టడం మాత్రమే కాకుండా.. ఆమెతో ఇతర కేసులను ఉపసంహరించుకోవడానికి ఒత్తిడి చేసిన వ్యవహారంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు పీకలదాకా కూరుకుపోయినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆ ఐపీఎస్ అధికారులు త్వరలో జైలుకు వెళ్లక తప్పదని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే కాదంబరీ జత్వానీ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. అప్పట్లో కాదంబరీ జత్వాన్ని  కస్టడీలోకి తీసుకుని ఆమె మీద ఒత్తిడి తేవడం ద్వారా జగన్ కళ్ళలో ఆనందం చూడడానికి, పారిశ్రామికవేత్తలతో జగన్ అనుచిత బంధాలను పెంచుకునేలా సహకరించడానికి ఈ పోలీసు ఉన్నతాధికారులు తమ హోదాలను వాడుకుని సహకరించారు. కుక్కల విద్యాసాగర్ అనే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని  కేవలం ఒక పావుగా ఈ క్రీడలో వాడుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాదంబరీ జత్వాని విజయవాడకు వచ్చి కేసులు పెట్టడంతో ఈ దుర్మార్గమైన పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారం వెలుగు చూసింది. వారు సస్పెండ్ అయ్యారు. అయితే విశాల్ గున్నీ, కాంతి రానా తాతా ప్రస్తుతం హైకోర్టులో ముందస్తు బెయలు పిటిషన్లు దాఖలు చేసుకుని ఉన్నారు.

అప్పట్లో కుక్కల విద్యాసాగర్ ద్వారా కేసు పెట్టించి, కేసు రిజిస్టరు కావడానికి ముందే బయల్దేరి ముంబాయికి వెళ్లిపోయి కాదంబరి జత్వానీని రోడ్డుమీద అటకాయించి అరెస్టు చేసి తీసుకువచ్చిన తీరు, ఇటీవల వెలుగులోకి వచ్చిన తర్వాత సర్వత్రా చర్చనీయాంశం అయింది. ప్రస్తుతానికి సీఐడీ విచారణను ఎదుర్కొన్న అప్పటి వ్యవహారంలోని ఇతర అధికారులు ఈ ముగ్గురు ఐపీఎస్ ల పాత్ర గురించి తమకు తెలిసిన వివరాలన్నీ వెల్లడించినట్టుగా కూడా సమాచారం. విశాల్ గున్నీ ఈ కేసులో తమ పాత్ర ఏమీ లేదని.. అంతా సీఎంవో ఆదేశాల మేరకే చేసినట్టుగా కూడా తెలియజేశారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారి బెయిలు పిటిషన్ల  గురించిన చర్చ ఇప్పుడు మొదలైంది.

వీరికి అసలు బెయిలు ఇవ్వవద్దని కాంతిరాణా తాతా ముంబాయికి విమానం టికెట్ బుక్ చేసుకుని ఉన్నారని, వీరిని ఒకసారి చేయి జారనిస్తే మళ్లీ దొరకరని సిఐడి పోలీసులు కోర్టుకు నివేదిస్తున్నారు.  వారి పారిపోయే అవకాశం ఉన్నదని సీఐడీ పోలీసులు హైకోర్టుకు చెప్పడాన్ని గమనిస్తే త్వరలోనే వారి అరెస్టు కూడా జరగవచ్చుననే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది.  మరి న్యాయస్థానం కాదంబరీ జత్వానికి న్యాయం చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!

Related Posts

Comments

spot_img

Recent Stories