షూరు అయిన సికిందర్‌ షూటింగ్‌!

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ తన కొత్త సినిమా సికిందర్‌ ను మొదలుపెట్టారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ డైరెక్ష‌న్ లో ‘సికంద‌ర్’ అనే సినిమాలో యాక్ట్‌ చేస్తున్నట్లు గ‌తంలోనే స‌ల్మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మూవీ మేక‌ర్స్ స్టార్ట్ చేశారు.

తొలిరోజు షూటింగ్ లో స‌ల్మాన్ పాల్గొన్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ ప్రకటించారు. ఈమేర‌కు ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. “స‌ల్మాన్ ఖాన్ గారితో వ‌ర్క్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది…” అంటూ త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ద‌ర్శ‌కుడు ఏఆర్.మురుగ‌దాస్ రూపొందిస్తున్నాడు.

ఈ సినిమాలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను సాజిద్ న‌డియాడ్వాలా ప్రొడ్యూస్ చేస్తుండ‌గా, 2025 ఈద్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories