ఆ క్రేజీ సిరీస్ కి షాకింగ్ రన్ టైం ..!

ఇటీవలి కాలంలో ఓటిటీల ప్రభావం ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని భాషల కంటెంట్ మన చేతుల్లోకి వచ్చేసింది. అందులో హాలీవుడ్‌ సూపర్‌ నాచురల్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘స్ట్రేంజర్ థింగ్స్’ కి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగినది. ఇప్పటికే నాలుగు సీజన్లతో భారీ విజయాలు సాధించిన ఈ సిరీస్‌ ఇప్పుడు ఐదో సీజన్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీజన్‌పై హైప్‌ కూడా ఆకాశాన్ని తాకుతోంది.

అయితే ఈ సీజన్‌ గురించి వస్తున్న తాజా సమాచారం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించడంతో పాటు కొంత షాక్‌ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఈ సారి ప్రతి ఎపిసోడ్‌ కూడా దాదాపు రెండు గంటల వరకు నడుస్తుందని టాక్‌ వినిపిస్తోంది. సాధారణంగా వెబ్‌ సిరీస్‌లలో ఎపిసోడ్‌ పొడవు ఒక గంటకు మించి ఉండదు. కానీ ఇక్కడ రెండు గంటలు అంటుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మొదట ఈ సీజన్‌ రెండు పార్టులుగా రిలీజ్‌ అవుతుందని తెలిసి కొందరు నిరాశ చెందారు. ఇప్పుడు రన్‌ టైమ్‌ గురించి వస్తున్న రూమర్స్‌ మాత్రం వారి ఉత్సాహాన్ని మరింత పెంచేశాయి. ఇక ఈ భారీ ఎపిసోడ్‌ల కోసం మేకర్స్‌ కూడా భారీగా ఖర్చు చేస్తున్నారట. ఒక్క ఎపిసోడ్‌కే సుమారు 50 నుంచి 60 మిలియన్‌ డాలర్లు వెచ్చిస్తున్నారని సమాచారం.

ఇక ఈ కొత్త సీజన్‌ యొక్క మొదటి వాల్యూమ్‌ నవంబర్‌ 27న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ కానుంది. నిజంగా ఈ సీజన్‌ లో ప్రతి ఎపిసోడ్‌ రెండు గంటలపాటు ఉంటుందా లేదా అన్నది అప్పుడే తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories