స్టార్ దర్శకుడు శంకర్ సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టి అందర్ని ఆలోచింపజేసేలా చేశారు. తాను హక్కులు పొందిన ఓ ప్రముఖ నవలలోని కొన్ని సన్నివేశాలను తన అనుమతి లేకుండా సినిమాల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ లో శంకర్ చెప్పారంటే…‘వెంకటేశన్ రాసిన ఐకానిక్ తమిళ నవల ‘నవ యుగ నాయగన్ వేళ్ పారి’ కాపీరైట్స్ నేను పొందాను
అయితే, నా అనుమతి లేకుండా అందులోని సన్నివేశాలను చాలా సినిమాల్లో ఉపయోగించడం చూసి షాకయ్యాను’ అని శంకర్ చెప్పుకొచ్చారు. తన పోస్ట్ లో శంకర్ ఇంకా ఇలా రాసుకొస్తూ.. ‘నవలలోని ముఖ్యమైన సీన్‌ను.. ఓ తాజా సినిమా ట్రైలర్‌లో చూసి కలత చెందాను. నవలలోని సన్నివేశాలను సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, మరే ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనైనా వాడటం మానుకోండి.
క్రియేటర్ల హక్కులను గౌరవించండి. కాపీరైట్‌ను ఉల్లంఘించకండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అంటూ శంకర్ హెచ్చరించారు.