బాలీవుడ్‌ లో శివాజీ మహరాజ్‌ బయోపిక్‌..రిషబ్‌ ది కాదుగా!

బాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చిన చిత్రం ‘ఛావా’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్రపై తెరకెక్కిస్తే రికార్డు వసూళ్లు వచ్చాయి. మరి అలాంటిది శివాజీ మహారాజ్ పైనే తెరకెక్కిస్తే? దానిపై కూడా భారీ హైప్ ఉంటుంది. అయితే హిందీలో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం కాకుండా ఇదే బాలీవుడ్ నుంచి మరో బయోపిక్ అనౌన్స్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ హీరో రితేష్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహిస్తుండడంతో పాటుగా శివాజీ మహారాజ్ పాత్ర కూడా తానే పోషించనున్నాడట. ఇక తనతో పాటుగా సంజయ్ దత్ ఇంకా అభిషేక్ బచ్చన్ తదితరులు కూడా నటిస్తున్నారు.

అలాగే ఆదిపురుష్ సంగీత దర్శకులు అజయ్ – అతుల్ లు సంగీతం సమకూరుస్తున్నారు. మరి ఈ చిత్రం రిషబ్ ఛత్రపతి కంటే ముందే వచ్చే ఏడాది మే 1 మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. రిషబ్ సినిమా 2027 జనవరిలో రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories