ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ కాంబోల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి.
ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ క్రేజీ న్యూస్ షికారు చేస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ నయనతార హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
గతంలో ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో చిరు చెల్లిగా నయనతార నటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు చిరు సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.