మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు చాలా విషయాలు బయటకొచ్చినా, హీరోయిన్ ఎవరు అన్న విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇన్నాళ్లుగా రుక్మిణి వసంత్ పేరు వినిపిస్తోంది.
ఇటీవల జరిగిన మదరాసి సినిమా తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఎన్.వి. ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో ఆ టాక్ మరింత బలపడింది. ఆయన మాట్లాడుతూ రుక్మిణి వసంత్ రాబోయే సినిమాల్లో ఒకటి ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అని చెప్పడంతో ఇక సందేహాలకు తావులేకుండా పోయింది.
దీంతో ఈ భారీ కాంబినేషన్‌లో హీరోయిన్‌గా రుక్మిణినే ఫైనల్ అయ్యిందని చెప్పొచ్చు.