సినీ ప్రపంచంలో అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఒక సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి. నిన్నటి వరకు ఈ ట్రెండ్ శ్రీలీల పేరుమీద నడిచింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ హరీష్ శంకర్ , రవితేజ కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అందులో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా. ఇదిలా ఉంటే ఈ భామ మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసినట్లు సమాచారం.
నేచురల్ స్టార్ నాని ఇటీవల సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా భాగ్యశ్రీ ని ఎంపిక చేసినట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఈ ముద్దుగుమ్మ నక్క తోక తొక్కినట్లే. మొదటి సినిమా విడుదల కాకముందే..మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిందంటే..ఈ అమ్మడు అదృష్టం మామూలుగా లేదనే చెప్పవచ్చు.
ఇదంతా ఒక ఎత్తు అయితే..ఈ భామ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే అవకాశాన్ని పట్టింది. డెబ్యూ డైరెక్టర్ రవి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కూడా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.అమెరికా బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చెరుకూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి మొదలు కానుంది.
ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఈ ముద్దుగుమ్మ లక్ మామూలుగా లేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.