‘పచ్చరంగు’.. జగన్ ను కడిగేసిన షర్మిల!

‘తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం’ అనే అసహ్యకరమైన సిద్ధాంతాన్ని రాజకీయ నాయకులు అనుసరించినట్లుగా బహుశా ప్రపంచంలో మరెవ్వరూ అనుసరించకపోవచ్చు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అతీతులైన వ్యక్తి ఎంతమాత్రమూ కాదు. చెల్లెలు పచ్చ రంగు చీర కట్టుకుంటేనే చూడలేకపోయిన ఈ అన్నయ్య.. ప్రతి నిత్యం తన భజనలో తరిస్తూ ఉండే సొంత పత్రిక సాక్షి కి మొత్తం ప్రారంభం నాటినుంచి పచ్చ రంగు పులుముకుంటూ ఎందుకు మురిసిపోతున్నారో ఆయన సమాధానం చెప్పగలరా? సొంత చెల్లెలి చీర గురించి కూడా బహిరంగసభలో మాట్లాడుతూ అన్నయ్య జగన్ ప్రదర్శించిన చవకబారు బుద్ధిని.. వైఎస్ షర్మిల ఉతికి ఆరేశారు. షర్మిల ఉతికిన తీరుకు బహుశా ఆయన బుద్ధిలో పచ్చదనం మొత్తం వెలిసిపోయి ఉండాలి.

పచ్చచీర కట్టుకుని సభకు వచ్చినది గనుక.. చంద్రబాబుకు మోకరిల్లినట్టుగా జగన్ చెల్లెలి గురించి విమర్శించారట. వేలమంది మగవాళ్లు ఉన్న సభలో తన చీర గురించి మాట్లాడుతారా అంటూ షర్మిల ఫైర్ అవుతున్నారు. ‘పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది. చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపురంగుపై చంద్రబాబుక ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మరచిపోయినట్టున్నారు.. సాక్షి పత్రిక, సాక్షి చానెల్ లో పైన పసుపురంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్ పసుపురంగు ఉంటే తప్పేముంది.. అది తెదేపా సొంతం కాదు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతోంటే అది జగన్ సభ్యత అనుకోవాలా? జగన్ రెడ్డికి సంస్కారం ఉందా?’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
తోడబుట్టిన ఆడబిడ్డ చీర గురించి కూడా విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా ఉండడం అనేది సిగ్గుచేటు అని చంద్రబాబుకూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెల్లెలు చీర గురించిన సంగతిని జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు ఫాలో అయ్యే చదివారో లేదో, అలవోకగా తన సొంత మాటలుగా చెప్పారో తెలియదు గానీ.. మొత్తానికి ఆ విమర్శ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయినట్టు కనిపిస్తోంది. చెల్లెలు అనే సంగతి పక్కన పెట్టినా.. ఒక మహిళ ధరించిన వస్త్రాల గురించి మాట్లాడడం అనేది లేకితనంగా ఆయన సొంత పార్టీ వారే భావిస్తున్నారు. ఓటమి తప్పదేమోననే అసహనంలో జగన్ తాను ఏం మాట్లాడుతున్నారో విచక్షణ కోల్పోతున్నారని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories