అసలు విలన్ అన్నయ్యే అంటున్న షర్మిల!

తనకు హీరో ప్రభాస్ కు సంబంధం ఉన్నట్టుగా అన్న జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రచారం చేయించారంటూ వైఎస్ షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ నివాసం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన షర్మిల వైఎస్ జగన్ మీద నిప్పులు చెరిగారు. తనమీద తప్పుడు అసభ్య ప్రచారం చేయించడం మాత్రమే కాకుండా.. ఆ వివాదాన్ని కూడా తన మీద సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకోవాలని చూస్తున్నారంటూ ఆక్షేపించారు. జగన్ అవకాశ వాద ధోరణుల్ని ఆమె ప్రశ్నించారు.

ప్రభాస్ తో తనకు సంబంధం ఉన్నట్టుగా గతంలో ప్రచారం జరిగిందని.. ఆ ప్రచారం ఎన్ బీకే టవర్స్ నుంచి జరిగినట్టుగా తెలిసిందని ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ లో అప్పటి వీడియో చూపించి.. షర్మిల మీద బాలకృష్ణ, తెలుగుదేశం నాయకులు సంబంధాలు అంటగడుతూ తప్పుడుప్రచారాలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. అయితే చెల్లెలి మీద జగన్ కు నిజంగానే అంత ప్రేమ ఉంటే,.. అప్పట్లో ఎందుకు స్పందించలేదని ఆమె ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం.. తన మీద ప్రజల్లో సానుభూతి సృష్టించుకోవడం కోసం తన వీడియోను కూడా వాడుకుంటున్నారని ఆమె అన్నారు. ఆయన సొంత తల్లిమీద కేసులు పెట్టగలరు.. సొంత తండ్రిని చార్జిషీట్లలో ఇరికించగలరు.. సొంత చెల్లికి సంబంధాలు అంటగట్టగలరు అంటూ జగన్ బుద్ధులను ఆమె దునుమాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా సైతాన్లతో తనమీద అసభ్య ప్రచారం చేయించింది జగన్మోహన్ రెడ్డే అని ఆరోపించారు.

తాను ప్రభాస్ ను ఎప్పుడూ చూడనే లేదని, వారు చెబుతున్న ప్రభాస్ ఎవరో తనకు తెలియను కూడా తెలియదని షర్మిల అనడం విశేషం. తన బిడ్డల మీద ప్రమాణం చేసి గతంలో కూడా ఇదే మాట చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని షర్మిల పేర్కొన్నారు.
మొత్తానికి అసలే వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుటంబంలో  తారస్థాయిలో ఉన్న రచ్చలు, విభేదాల్లో ఈ సోషల్ మీడియా పోస్టులు వాటి వెనుక ఉన్న వ్యక్తుల గురించిన వివాదం మరింత ఆజ్యం జత చేసినట్లు అయింది. అన్నమీద షర్మిల తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జగన్ కోటరీ నుంచి మాత్రం జవాబు ఉండడం లేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories