జగన్ దుర్బుద్ధులను లాజికల్ గా చాటుతున్న చెల్లెమ్మ!

రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సుమారు రెండు దశాబ్దాలుగా తెలుసు. ఈ ఇరవై ఏళ్ల నుంచి మాత్రమే.. ప్రజలు ఆయన తీరును, వ్యక్తిత్వాన్ని, బహుశా ఆయన నాయకత్వ లక్షణాలను కూడా గమనిస్తుండవచ్చు. కానీ ఆమె సంగతి అలా కాదు. ఇంచుమించుగా.. అయిదు దశాబ్దాలుగా ఆమె జగన్ ను గమనిస్తున్నారు. జగన్ బుద్ధులను గమనిస్తున్నారు. జగన్ గురించి ఆమెకు తెలిసినంతగా మరొక ఒకరిద్దరికి మాత్రమే తెలుస్తుంది. అలాంటి షర్మిళ ఇప్పుడు జగన్ వ్యవహార సరళిలో ఒక లాజికల్ పాయింట్ ను బయటపెడుతున్నారు.

జగన్ ఇప్పుడు ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అయినాసరే మాజీ ముఖ్యమంత్రి గనుక.. వైఎస్సార్ కొడుకుగా కీలక నాయకుడు గనుక ఆయనకు జడ్ ప్లస్ భద్రత ఉంది. అది చాలదన్నట్టు ఎక్కడకు వెళ్ళినా తనకు రోప్ పార్టీ కావాలని.. తన సెక్యూరిటీ పెంచాలని జగన్ గోల చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో షర్మిల ఒక లాజిక్ బయటకు తీస్తున్నారు.

జగన్ తాను సీఎం గా ఉన్న రోజుల్లో అసలు ప్రజల్లోకి వచ్చేవారు కాదు. ఒక ఊర్లో అడుగు పెడుతున్నారంటే చాలు.. రోడ్ల పక్కన బారికేడ్లు కట్టేసి.. జనం రాకుండా కంట్రోల్ చేసేవారు.  రోడ్ల పక్కన చెట్లు కూడా నరికేసేవారు. హెలికాప్టర్ లో వెళుతున్న కూడా కింద రోడ్ మీద చెట్లు నరికేసేవాళ్ళు. ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో ఇప్పటిలా కరచాలనాలు కాదు కదా రోడ్ మీద కనీసం దగ్గరినుంచి చూసే భాగ్యం కూడా ప్రజలకు దక్కేది కాదు. కానీ ఇప్పుడు స్టైల్ మార్చారు. జనంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కపట ప్రేమ, కుట్ర అంటున్నారు ఆయన చెల్లెలు షర్మిల.  ప్రతి విషయంలోనూ ప్రజలను మోసం చేస్తూ ముందుకు సాగుతున్న జగన్.. తనకోసం జనం ఎగబడుతున్నారంటూ బలప్రదర్శన చేయడానికి జన సమీకరణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిబంధనలు, ఆంక్షలను ఆయన పట్టించుకోరు అని విమర్శిస్తున్నారు. 

చెల్లెమ్మ చెబుతున్న లాజిక్ గమనిస్తే ఎవరికైనా సరే, నిజమే కదా అనిపిస్తుంది. జగన్ కోసం ఎగబడుతున్న అందరూ కిరాయి జనాలే అనికూడా అర్థమవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories