కర్ణాటకలో తెలుగు చిత్రపరిశ్రమకు అవమానం!

సంక్రాంతి సీజన్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా పెద్ద పండుగే. అందుకే, భారీ సినిమాలు సంక్రాంతి టార్గెట్‌ గా బరిలో నిలుస్తుంటాయి. మూడు నాలుగు భారీ సినిమాలు ఒకే వారంలో వచ్చినా అన్ని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయి. పైగా డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.

అయితే, పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం తెలుగు సినిమాలకు తీవ్ర అవమానం ఎదురైంది. ఎక్కడైనా గోడ పై తెలుగు సినిమా పోస్టర్లు కనిపిస్తే.. ఆ పోస్టర్లను కన్నడిగులు వెంటనే చించేస్తున్నారు. కొన్నిచోట్ల అయితే ఆ పోస్టర్ల పై నల్లరంగు పూసి నిరసన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

అయితే తెలుగు సినిమా పోస్టర్లను కన్నడిగులు చించడానికి ముఖ్య కారణం కూడా ఉంది.. పోస్టర్లు తెలుగులో ఉండటమేనట. మా రాష్ట్రంలో తెలుగులో పోస్టర్స్ వేయడం ఏమిటి ? అంటూ వారు పోస్టర్లు చించివేస్తున్నారని తెలుస్తుంది.

పైగా ఆ తెలుగు పోస్టర్లపై కన్నడ అని కూడా రాసుకుంటున్నారు. మొత్తానికి కర్ణాటకలో కూడా భాషాభిమానం రోజురోజుకు పెరుగుతుందనడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ అని చెప్పుకొవచ్చు.

అన్నట్టు కర్ణాటకలో కూడా బాలయ్య, చరణ్ లకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. వారి సినిమాలకు అక్కడ భారీ కలెక్షన్స్ వస్తాయి. అలాగే వెంకటేష్ కి కూడా అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి వారి ముగ్గురి సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories