ఆ మూవీ కోసం సీరియస్‌ గా!

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ కాంబోలలో లెజెండరీ దర్శకులు మణిరత్నం అలాగే  కమల్ హాసన్ ల కాంబో కూడా ఒకటి. మరి సినిమా ఉన్నన్నినాళ్ళు నిలిచిపోయే నాయకుడు లాంటి సినిమా తర్వాత మళ్ళీ ఎన్నో ఏళ్ళకి చేస్తున్న సినిమానే “థగ్ లైఫ్”. తమిళ్ నుంచి ఒక సాలిడ్ మల్టీస్టారర్ గా కూడా వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఒకో అప్డేట్ ఇస్తూ ఉన్నారు.

ఇలా జూన్ రిలీజ్ కి ఈ చిత్రాన్ని రెడీ చేస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా మాత్రం కొంచెం సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ సింగిల్ లాంఛ్ కి కూడా తమిళ నాట ఒక ఈవెంట్ పెట్టి అందులోని ప్రెస్ మీట్ కూడా పెట్టి లాంచ్ చేస్తున్నారంటే  వారు ఈ సినిమాని ఏ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు రెడీ అవుతున్నారో తెలుస్తుంది. ఎలాగో ఆడియో లాంచ్ కూడా ఉంది కానీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కే ఇంత హడావుడిగా ప్లాన్ చేస్తుండడం అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరి ఈ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories