సీక్వెల్‌ కన్ఫార్మ్‌!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇటీవల ‘జాట్’ అనే బాలీవుడ్ చిత్రాన్ని తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

అయితే, ఇప్పుడు తన డైరెక్షన్‌లో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ చిత్రానికి కూడా సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో మాస్ రాజా రవితేజ హీరోగా ‘క్రాక్’ అనే సినిమాను రూపొందించారు గోపీచంద్ మలినేని. కోవిడ్ తర్వాత విడుదలైన ఈ మూవీ జనాలను థియేటర్లకు రప్పించడంలో బాగా సక్సెస్‌ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు గోపీచంద్.

మాస్ రాజా రవితేజ పవర్‌ఫుల్ యాక్షన్‌కు శ్రుతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌ల పర్ఫార్మెన్స్ తోడవడంతో ‘క్రాక్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ఈ డైరెక్టర్ ఎలాంటి కథను రెడీ చేస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories