వైసీపీ మార్గాన్నే ఫాలో అవుతున్న సీనియర్ ఐపీఎస్

అన్నీ డొంక తిరుగుడు జవాబులే. చేసిన నేరానికి సంబంధించి నీ సంజాయిషీ ఏమిటి అని అడిగినప్పుడు అర్థంపర్థం లేని మాటలతో కాలం వెళ్ళబుచ్చడం.. సాక్ష్యాధారాలు సహా జరిగిన అవినీతిని ఆయన ముందు ఉంచి వివరాలు అడిగినప్పుడు.. తెలియదు గుర్తులేదు మరిచిపోయా అని సమాధానాలు చెప్పడం.. ఆధునికతరం పోలీస్ విచారణలో ఒక అంతర్భాగం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో విచ్చలవిడి అవినీతికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ మార్గాన్వేషణ చేశారు. గతంలో జరిగిన అవినీతికి సంబంధించి అనేక కేసులు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరవుతున్న వైసిపి నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకే తరహా సమాధానాలు ఇస్తూ వచ్చారు. విచారణను తప్పుదోవ పట్టించే లాగా సహకరించకుండా కాలయాపన చేయడం మీదనే దృష్టి పెడుతూ వచ్చారు. ఆ రకంగా వైసీపీ నాయకులు తీర్చిన బాటలోనే సీనియర్ ఐపీఎస్ అధికారి జగన్ రెడ్డి పాలన కాలంలో ఏసీబీ బాధ్యతలు కూడా చూసినటువంటి సంజయ్ ఇప్పుడు ముందుకు సాగుతున్నారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తూ చెలరేగుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ గా ఉన్నసమయంలో సంజయ్ పాల్పడిన అవినీతి సంబంధించి కీలక కేసులలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వేరే గత్యంతరం లేక కోర్టు ఎదుట లొంగిపోయిన సంజయ్ ను ఏసీబీ కోర్టు రిమాండుకు పంపింది. ప్రస్తుతం పోలీసులు ఆయన మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు. గతంలో అగ్నిమాపక శాఖలో కీలకంగా ఉంటూ చేసిన అవినీతికి సంబంధించి మూడు రోజుల్లో ఏకంగా అ50కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే.. సంజయ్ మాత్రం ఏమాత్రం సహకరించకుండా సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి సంజయ్ ను కస్టడీ విచారణకు ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, ఆ పార్టీకి కొమ్ముకాసిన అధికారులు అందరూ ఒకటే సిలబస్ చదువుకుని విచారణకు వస్తున్నట్టుగా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. అందరూ ఒకే తరహాలో.. తప్పించుకోవడానికి జవాబులు చెబుతున్నారే తప్ప.. సూటిగా తమ మీద ఆరోపణల్ని ఖండించడం కూడా లేదు. సంజయ్ అయితే.. తన హయాంలోని ప్రతి అవినీతి చర్యలకు సంబంధించి.. కిందిస్థాయుల్లోని అధికారులు అందరూ ఆమోదించిన తర్వాతనే బిల్లుల చెల్లింపు జరిగిందని.. తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. పీఎస్సార్ ఆంజనేయులు కూడా గ్రూప్ 1 ప్రశ్నపత్రాలు మూల్యాంకనానికి సంబంధించిన కేసులో ఇలాంటి సమాధానాలే చెప్పారు.

ఇప్పుడు సంజయ్ తనకు రెండేళ్ల కిందట బైపాస్ సర్జరీ జరిగిందని.. కాబట్టి తనకు ఆరోగ్యం సరిలేదు గనుక.. ఇప్పుడు బెయిలు ఇచ్చేయాలని అడుగుతున్నారు. సర్జరీ అయిన, కుట్లు పచ్చిగానే ఉన్న అచ్చెన్నాయుడును అరెస్టుచేసి వందల కిలోమీటర్ల కారులో తరలించిన దారుణం గుర్తుకువస్తోందా? అదే మరి!

Related Posts

Comments

spot_img

Recent Stories